ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు నిర్వహించక పోవడంతో, మూడు నెలల బడ్జెట్ కు ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకురానుంది. జూన్ 30 వరకూ అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ రూపొందించనున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ కు ఆర్డినెన్స్ ను పంపుతారు.
ఇప్పటి వరకు 1వ బ్లాక్ల్ లోని సీ.ఎం.ఓ లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.