వారిని కొట్టకుండా ఉంటే చాలు…!

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి మంచి సదుపాయాలు కల్పిస్తూ.. వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. ఇటీవల వసతి గృహాలు మూసివేయడంతో జంట నగరాల నుండి అనేక వందలమంది విద్యార్థులు ఏపీకి వస్తున్న దారిలో జగ్గయ్యపేటకి దగ్గర్లోవున్న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వారిని కొన్ని గంటల పాటు ఆపి నరకం చూపించిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 6:44 pm
Follow us on


ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి మంచి సదుపాయాలు కల్పిస్తూ.. వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. ఇటీవల వసతి గృహాలు మూసివేయడంతో జంట నగరాల నుండి అనేక వందలమంది విద్యార్థులు ఏపీకి వస్తున్న దారిలో జగ్గయ్యపేటకి దగ్గర్లోవున్న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వారిని కొన్ని గంటల పాటు ఆపి నరకం చూపించిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండటానికి ఒప్పుకుంటేనే ఏపిలోకి అనుమతిస్తారనే కొత్త రూల్ తీసుకొచ్చారు.

కరోనా నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి 14 రోజులు క్వారంటైన్‌ కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇవ్వాలని, వారికి మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ బయటకు వచ్చే వారి పట్ల పోలీసులు చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల ఆడా, మగా తేడా లేకుండా విచ్చల విడిగా కొడుతూ దుర్భాషలాడుతున్నారు. ఎందుకలా చేస్తున్నారంటే.. మీ మంచి కోసమే అనే సమాధానాలు చెబుతున్నారు. కరోనా సోకి పోయి విషయం దేవుడెరుగు.. ఈ పోలీసులు కొట్టే దెబ్బలకే పోయేలా ఉన్నామని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి మంచి సదుపాయాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కనీసం తిట్టకుండా, కొట్టకుండా ఉంటె చాలనేది అనేక మంది అభిప్రాయం.