
ఈయన ఏది మాట్లాడినా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈయన ప్రతి వారం కొత్త కొత్త విషయాలను మనకు ఆవిష్కరిస్తుంటాడు . సామాన్యుడికి ఐతే ఇతను చెప్పే విషయాలు ఒక పట్టాన అర్ధంకావు. ఈమధ్య తెలుగు మాధ్యమాల్లో ఇలాంటి వారు చాలా మంది పుట్టుకొస్తున్నారు. ప్రధమంగా ఇలాంటి వారు, వారి గురుంచి వారు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇతర ప్రచార సాధనాలు రానంత వరకు వీరి మీడియాలో ఏమి మాట్లాడితే , ఏది రాస్తే అదే ప్రవచనము అనుకోవాలి.
విషయానికి వస్తే ఈయన కొత్త చెత్త పలుకులో మనకు కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. అదేంటంటే కెసిఆర్ గారు హరీష్ రావు ను కొత్త పార్టీ పెట్టటానికి తానే వెనకనుండి తెరవెనక భాగోతమ్ నడిపిస్తున్నాడు అనే ఎవరికీ తెలియని దాన్ని ఈయన కనుక్కున్నాడు. ఇంకా ముందుకు వెళ్లి తమిళనాడులో DMK , AIADMK తరహాలో ఏదో ఒక పార్టీ వాళ్ళ కుటుంబం లోనే ఉండేటట్లు కెసిఆర్ వ్యూహమాట . ఈ కుహానా మేధావులు మొదట చేసే పని ఏమిటి అంటే ఆ విషయం నిజమయిన కాక పోయినా ముందర ఒక అనుమానపు బీజాన్ని ప్రజల మనస్సులో నాటాలి. ఈ రకంగా వీళ్లు ముందర వీళ్ళ పేపర్లు చదివే వాళ్లలో ఆసక్తిని రేకిస్తారు అదే సమయంలో వీరి ప్రతికూల పార్టీలో కొంత అనుమానాన్ని రేకిస్తారు.
ఇవన్నీ పాతకాలం నాటి విధానాలు RK గారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడు తున్నారో అందరికి తెలుసు. ప్రజలకు ఏదన్న ఉపయోగం ఉండే విషయాలు మాట్లాడితే బాగుంటదేమో ఆలోచించండి సారూ RK గారూ .