
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సినిమా పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీగా పింక్(తెలుగు) ప్రారంభమైంది. పవన్ ఈ మూవీ చేస్తుండగానే ఆయన తదుపరి సినిమా క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే పవన్ మూడో సినిమా ‘పండగసాయన్న’ అంటూ టైటిల్ పేరుతోసహా సోషల్ మీడియాలో ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది.
Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..
పవన్ ఫొకస్ సినిమాలపైనే!
పింక్(తెలుగు) మూవీ కోసం పవర్ స్టార్ కేవలం 20రోజుల మాత్రమే కేటాయించారని సమాచారం. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోలకు సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా ఓవైపు జరుగుతుండగా పవర్ స్టార్ తదుపరి మూవీ క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. మొగల్ సామ్రాజ్య కథాంశంతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. ఈ సినిమాపై పవన్ బందిపోటుగా నటిస్తాడని సమాచారం. పవన్ సరసన ఇద్దరి భామలకు అవకాశం ఉండగా కంచె బ్యూటీ ప్రగ్య జైస్వాల్ ఒక కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసింగ్ పేరు విన్పిస్తుంది.
Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?
తెరపైకి ‘పండగసాయన్న’
పవన్ నటించే మూడో సినిమా ‘పండగ సాయన్న’ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి చేసిన సైరా మూవీ తరహాలోనే పండుగ సాయన్న అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథతో పవన్ చిత్రం ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ ఇటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న నేపథ్యంలో వరుస సినిమా పేర్లు తెరపైకి రావడం ఒక్కింత ఆశ్చర్యం కలుగజేస్తోంది. పవన్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏడాది ఒక సినిమా రావడమే గగనంగా ఉండేది. అలాంటిది అటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న సమయంలో వరుసగా సినిమాలు చేస్తాడని ప్రచారం జరగడంలో అంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. గతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ తిరిగి ఆ లెక్కలను సరిచేసేందుకు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై పవన్ తరుపు నుంచి వీటిపై ఎలాంటి ఖండన రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా పవర్ స్టార్ తాను చేయబోయే సినిమా లెక్కలపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి మరీ..