https://oktelugu.com/

Pawan Kalyan Jalsa movie: ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్ జల్సా సినిమా స్పెషల్ షోలు

Pawan Kalyan Jalsa movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా జల్సా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 సినిమాగా నిలిచింది..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఈ సినిమా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2022 / 04:03 PM IST
    Follow us on

    Pawan Kalyan Jalsa movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా జల్సా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 సినిమాగా నిలిచింది..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఈ సినిమా కంటెంట్ అప్పటి ఆడియన్స్ కి యావరేజి రేంజ్ లో అనిపించినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మరియు దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ వల్ల ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది..ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది..అలాంటి సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఘనంగా విడుదల కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయిపోయాయి.

    Pawan Kalyan Jalsa movie

    Also Read: Prabhas Fans: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. మారుతి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు లీక్‌..

    ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమాకి దాదాపుగా వందకి పైగా స్పెషల్ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్..ఇప్పటికే 30 కి పైగా షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఆ 30 షోలు దాదాపుగా హౌస్ ఫుల్ అయిపోయాయి..ముఖ్యంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో అయితే ఈ సినిమాకి ఏకంగా 16 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు..ఈ 16 షోస్ కి కలిపి 17 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది..ఈ స్థాయి గ్రాస్ మిగిలిన స్టార్ హీరోలకు మొదటి రోజు రావడమే గొప్ప విషయం..ఇక మిగిలిన మల్టీప్లెక్స్ షోస్ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి..అలా విడుదల సమయానికి ఈ సినిమా మరో 70 కే పైగా అదనపు షోస్ యాడ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా షోస్ కౌంట్ సంఖ్య 500 నుండి వెయ్యి కి కూడా చేరే అవకాశం ఉందట..ఆ వెయ్యి షోస్ ఫుల్ అయితే ఈ సినిమా ప్రపంచ రికార్డు సృష్టించినట్టే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు..ఎందుకంటే ఒక సినిమా రీ రిలీజ్ అయ్యి వెయ్యి షోస్ ఫుల్స్ పెట్టినట్టు గతం లో ఎన్నడూ జరగలేదు..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఆగస్టు 9 వ తేదీన పుట్టిన రోజు సందర్భంగా 350 షోస్ వేసుకున్నారు మహేష్ బాబు అభిమానులు..అదే నిన్న మొన్నటి వరుకు పెద్ద రికార్డు..ఇప్పుడు ఆ రికార్డు ని జల్సా సినిమా చాలా తేలికగా దాటేసింది.

    Pawan Kalyan

    Also Read: Ananya Nagalla: అవకాశాల కోసం ఆ భాగానికి సర్జరీ చేయించుకున్న అనన్య… తేడా కనిపిస్తుంది నిజమేనంటున్న జనాలు