
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో జరిగిన ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్స్ అనే సదస్సుకు హాజరై…అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. తన ప్రసంగం మొత్తం ఆంగ్ల బాషలోనే వినిపించారు.
జగన్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉండాలో ఇంగ్లీషులోనే వివరిస్తుంటే…వినే వాళ్లంతా ఆలా చూస్తూ ఉండిపోయారు. చదువు విషయంలో ప్రపంచ దేశాలలో మన దేశ స్థానమేమిటో వివరిస్తూ… తాను విద్యకి ఇస్తున్న విలువ ఏంటో బయలుపరిచారు. విద్య రంగంలో చేస్తున్న సంస్కరణలు అన్నీ వివరిస్తూ…ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారు.
రాజధాని విషయం ప్రస్తావిస్తూ.. అందులో జరిగిన అవకతవకలు అన్నిటిగురించి వివరించారు. అమరావతికి తన దెగ్గర డబ్బు లేదని చెప్తూ….దానికి ఖర్చు చేసే దాంట్లో పదోవంతు వైజాగ్ నగరానికి ఖర్చు చేస్తే హైదరాబాద్ ని తల దాన్నే నగరాన్ని తయారు చేయొచ్చని జగన్ అన్నారు.
ఏది ఏమైనా జగన్ ప్రసంగానికి అందరు మైమరిచి పోయారు. తాను ఇంగ్లీష్ లో మాట్లాడటం విన్న ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే…ఆలా ఉంది జగన్ చేసిన ప్రసంగం.