
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. .ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా అవి సృష్టిస్తున్న వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందించాడు.
మొన్న దీపావళి రోజున ఆటంబాంబ్ లాగా రిలీజ్ చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ ట్రైలర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ నేతలు ఆరోపిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. కమ్మ సామాజికవర్గం అధిపత్యంలో ఉండే విజయవాడ ప్రాంతంలో రెడ్లు పాగా వేశారని వర్మ చూపించే ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే పరిణామలను జోడించి తీసిన సినిమా అని వర్మ చెప్పారు. మొత్తానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కావలిసిన కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు వర్మ.
తాజాగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో పాటు కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఈ సినిమా టైటిల్‌పై నిషేధం విధించాలని ఫిర్యాదు చేశారు. కులాల మద్య గొడవల సృష్టిస్తూ.. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందన్నారు. వెంటనే ఈ సినిమా టైటిల్ నిషేధించడంతో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
వర్మ ఏ సినిమా తీసినా సరే దాని వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కినతరువాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ ద్వారా సంచలనం క్రియేట్ చుసిన వర్మ మాత్రం ఈ సినిమాద్వారా కాస్ట్ ఫీలింగ్ ఉన్న రాజకీయ నాయకులకు సందేశం ఇవ్వబోతున్నానని చెపుతున్నారు. ఈ మధ్య వర్మతో జరిగిన ప్రతి మీడియా చర్చ వేదికల్లో అడిగే ప్రతి ప్రశ్నకు వర్మ ఇచ్చే సమాధానం వెటకారం గా ఉందని చర్చ వేదికలో పాల్గొన్న వారు మరియు నిర్వహించినవారు వాపోయారు.
మరి ఇప్పటికే సంచలనం సృష్టించిన వర్మ , తాను అన్నట్టు సందేశం ఇవ్వబోతున్నాడా? తెలియాలంటే ఈ సినిమా ఎన్నో అవరోధాలను దాటుకొని రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తే గాని తెలియదు.