
2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు అతివేగంగా మార్పు చెందాయి. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అండతో బీజేపీ దండతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి అనూహ్యమైన అపజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..
టీడీపీ, తన అధికారాన్ని కోల్పోయి దాదాపు 7నెలలు అయింది.. ఈ ఏడు నెలల కాలంలో టీడీపీ పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఒకవైపు ఎన్నికల మ్యానిఫెస్టోని జగన్ అమలుపరుస్తూ… ప్రజల్లో నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు టీడీపీలో ఉన్న బలమైన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపెట్టి బీజేపీలో, వైసీపీలో చేరుతుంటే.. ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు ప్రతిపక్ష నేత. ఎంతో కొంత సపోర్ట్ చేసే పవన్ కూడా ఇప్పుడు బీజేపీలో కలవడంతో టీడీపీకి “మూలిగే నక్క మీద తాటికాయ” పడినట్లు అయింది.
“ఉన్నోడు పోయే.. ఉంచుకున్నోడు పోయే” అంటే ఇదేనేమో.. టీడీపీలో ఎంతకాలంగా ఉన్న నాయకులు పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరారు. జనసేన స్థాపించిన రోజు నుంచి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో కలవడంతో టీడీపీకి మరింత గడ్డు కాలం ప్రారంభమైందని చెప్పొచ్చు.