
పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే అభిమానులు కోకొల్లలు. స్వయంగా అన్నయ్య చిరంజీవి తనకున్న అనుభవంతో పవన్ కళ్యాణ్ కి ఒక ఫంక్షన్ లో అభిమానుల ముందు పర్సనల్ సలహాగా సినిమాలలో నటించడం ఆపవద్దని అన్నారు. అన్నయ్య సలహాని గౌరవిస్తూ పవన్ రెండు సినిమాలలో నటించినా గాని తరవాత పుల్ స్టాప్ పెట్టేసారు. మళ్ళి ఇన్నాళ్లకు పవన్ మళ్ళి నటిచడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది . రాజకీయాలలో బాగా బిజీ అయిన పవన్ అసలు సినిమాలలో నటిస్తాడా? లేదా? అనే సందేహాలున్న అభిమానులకు ఇది ఒక పండుగలాంటి వార్తే మరి …
విషయమేమిటంటే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రీసెంట్‌గా ఓ డైరెక్టర్ చెప్పిన కథ పవర్ స్టార్ కి నచ్చిందంట. ఇంతకూ… పవన్‌ని తన కథతో మెప్పించిన దర్శకుడెవరో కాదు.. జాగర్లమూడి క్రిష్. గమ్యం, వేదం, కృష్ణమ్ వందే జగద్గురమ్, కంచె వంటి డిఫరెంట్ సినిమాలను క్రిష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకునట్లు కుదిరితే పవన్, క్రిష్ సినిమా తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.