
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ సంక్రాంతి పండుగ కార్యక్రమాల్లో భాగంగా నిన్న భోగి పర్వదినాన మంత్రి కొడాలి నాని పిలుపు మేరకు గుడివాడ లో జరిగిన ఎడ్ల పందాలను చూడడానికి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే… కానీ నిన్న జరిగిన పండగ వాతావరణంలో రాజకీయంగా ఒక ముఖ్య సంఘటన జరిగింది. అదేమిటంటే … ఎడ్ల పందాలు ముగిసిన అనంతరం వైస్ జగన్ గుడివాడ నుండి తిరుగు ప్రయాణంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని తనతో స్వయంగా హెలికాఫ్టర్ లో తన నివాసానికి తీసుకువెళ్ళారంట.. 45 నిముషాలపాటు ఇరువురు కలిసి చర్చించుకున్నట్టు సమాచారం…
ఈ భేటీ దేని కోసం అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. అలా చేరితే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఆ సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయో చెప్పలేం.. అందుకే వంశీ ఈ విషయంలో రిస్క్ ఇంకా తీసుకోవడం లేదు. అయితే ఇదంతా జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతోందని ఓ టాక్ ఉంది. అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న దానిపై వల్లభనేని వంశీ జగన్ తో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.
మరోవైపు తాజాగా రాజధాని మార్పు అంశం.. కృష్ణా జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపైనా జగన్, వల్లభనేని వంశీ మధ్య చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఈ చర్చల సారాంశం ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్ అవుతోంది.