Homeజాతీయ వార్తలుచంద్రబాబు ఆర్ఎస్ఎస్ తో రహస్య భేటీ ?

చంద్రబాబు ఆర్ఎస్ఎస్ తో రహస్య భేటీ ?

రాజకీయాల్లో చంద్రబాబు తీసుకున్నన్ని యు టర్న్ లు ఎవరూ తీసుకోలేదేమో. ఇందులో రికార్డు కొట్టేసాడు. దానితోపాటు విశ్వసనీయతను పోగొట్టుకున్నాడు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బీజేపీ నుంచి బయటకొచ్చి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరాడు. చేరటమేకాదు బీజేపీ కి తనంత బద్ద వ్యతిరేకి ప్రపంచంలో ఇంకెవ్వరూ వుండరన్నట్లుగా ప్రవర్తించాడు. ముస్లిం సోదరుల దగ్గరకెళ్ళి తనంత సెక్యూలర్ ఎవరూ లేరన్నట్లు మాట్లాడాడు. అందరూ ఈ చంద్రబాబేనా ఇంతకాలం బీజేపీ తో రాసుకు పూసుకు తిరిగింది అని ఆశ్చర్యపోయారు.

ఎన్నికలై పోయాయి. సీన్ మారింది. బీజేపీ తిరిగి అధికారం లోకి వచ్చింది. ఆ రోజునుంచి ఈ రోజు వరకు తిరిగి ప్రతిపక్ష నాయకుల్ని పలకరించిన పాపాన పోలేదు. ఫారూఖ్ అబ్దుల్లా జైలులో వున్నా నాలుగు సానుభూతి మాటలు చెప్పలేదు. శరద్ పవర్ పై సిబిఐ కేసు పెడితే పలకరించను కూడా పలకరించలేదు. అంతటితో ఆగలేదు. తనకుడి భుజం, ఎడమ భుజం లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీ లో చేర్పించాడు. మొన్నటికి మొన్న వైజాగ్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బీజేపీ నుంచి బయటకొచ్చి తప్పు చేశానని ప్రశ్చాత పడ్డాడు. అమిత్ షా కు పనిగట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇంకోసారి ముక్కునవేలేసుకొని ఆశ్చర్యపోవటం ప్రజలవంతైంది.

అయినా బీజేపీ నాయకత్వం గేట్లు తెరవలేదు. మోడీ, అమిత్ షా లకు కోపం తగ్గినట్లు లేదు. చంద్రబాబు నాయుడుకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని తెలుస్తూంది. ఇక ఏం చేయాలో అని బుర్ర బద్దలు కొట్టుకొని ఇంకో బ్రహాస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. బీజేపీ ఎవరు చెబితే వింటారో వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రహస్యంగా నాగపూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలకుడు మోహన్ భగవత్ తో రెండు గంటలపాటు భేటీ అయినట్లు సాంఘిక మాధ్యమాల్లో , పత్రికల్లో వచ్చింది. ఇంకోసారి ఆశ్చర్యపోవటం ప్రజల వంతయ్యింది. బీజేపీ ని కలవటం వేరు, ఆర్ఎస్ఎస్ ని కలవటం వేరు. తన పని నెరవేరటం కోసం ఎక్కడికైనా వెళ్తాడని, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడని ఇంకోసారి ప్రజలకు అర్ధమయ్యింది. ఆర్ఎస్ఎస్ మతవాద సంస్థ అని నిన్నటిదాకా బ్రాండ్ వేసి ఇప్పుడు ఒక్కసారి దాని పంచన చేరటం ఏ విధంగా సమర్ధించుకుంటాడో చూడాలి. నాలుక్కి నరం లేదు కదా ఎటయినా తిరుగుతుంది. తెలుగుదేశంలోని ‘ సెక్యూలర్ వాదులు ‘ ఈ చర్యను ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. ఈ మధ్య వాళ్ళ అనుకూల మీడియా లో బీజేపీ వ్యతిరేక, మోడీ వ్యతిరేక వార్తలు తగ్గాయి. ఒకవైపు వేమూరి రాధాకృష్ణ అమిత్ షా ని కలవటం , చంద్రబాబు నాయుడు మోహన్ భగవత్ ని కలవటం చూసిన తర్వాత ప్రజలు మా చెవుల్లో పూలు పెట్టారని అనుకుంటున్నారు. సోషల్ మీడియా లో మోడీ వ్యతిరేక వార్తలు, రోజూ పోస్టులు పెట్టే తెలుగు దేశం సెక్యూలర్ వాదుల పోస్టులు మూగపోయాయి. మనదేశంలో సెక్యూలరిజాన్ని వాళ్ళ స్వార్ధం కోసం వాడుకుంటున్నారని చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం కావాలి? మరి చంద్రబాబు నిరీక్షణ మోడీ, అమిత్ షా కరుణా కటాక్షం కోసం ఫలించేనా?

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version