
అయోధ్యలో “రామజన్మ భూమి-బాబ్రి మసీదు” ల శతబ్దాల చరిత్రలో దశాబ్దాల కేసులో అంతమ తీర్పు వెలువడిన తర్వాత రామ మందిర నిర్మాణం తెర పైకి వచ్చింది.
అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లోనే ఒక ప్లాన్ రూపొందించారు. అదే ప్లాన్ ప్రకారం ఇప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. చంద్రకాంత్ సోంపుర కుటుంబానికి దేశంలోని ఎన్నో ఆలయాలను డిజైన్ చేసిన ఘనత ఉంది. గుజరాత్‌లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం కూడా రూపకల్పన చేసింది ఆయన తాతగారే.
అయోధ్యలో రామ మందిరం ప్లాన్ ఇలా ఉంటుంది.

“రామమందిరం పొడవు 270 అడుగులు. వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి. దానికి ఒక వైపున కథా కుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శించవచ్చు. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్. భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. నాలుగు వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దగా, చిన్నగా కట్టినా, మందిరం ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.” అని చంద్రకాంత్ వివరించారు.
