
వెంకిమామ మూవీ తర్వాత వెంకటేష్ తమిళ హిట్ మూవీ ‘అసురన్’ రీమేక్ లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుంది. కాగా ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి యస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.