జస్టిస్ ఫర్ దిశ:దట్ ఈజ్ కెసిఆర్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెరపడినట్లయింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను గమనిందాం.. గతనెల 27 రాత్రి ‘దిశ’ సంఘటన చోటుచేసుకుంది. ఈ భయంకర ఘటనను అనేకమంది ఖండించారు. ఇటు తెలుగు న్యూస్ చానల్స్ అటు జాతీయ మీడియా “జస్టిస్ ఫర్ దిశ” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. సినీప్రముఖులు, మహిళా సంఘాలు, మేధావులు, దేశంలోని వివిధ రాజకీయపార్టీ నేతలు ఈ ఘటనను […]

Written By: admin, Updated On : February 8, 2020 9:30 am
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెరపడినట్లయింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను గమనిందాం..

గతనెల 27 రాత్రి ‘దిశ’ సంఘటన చోటుచేసుకుంది. ఈ భయంకర ఘటనను అనేకమంది ఖండించారు. ఇటు తెలుగు న్యూస్ చానల్స్ అటు జాతీయ మీడియా “జస్టిస్ ఫర్ దిశ” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. సినీప్రముఖులు, మహిళా సంఘాలు, మేధావులు, దేశంలోని వివిధ రాజకీయపార్టీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ వారి నిరసనలను తెలియజేసారు. పార్లమెంట్ లో కూడా ఈ సంఘటన పై చర్చ జరిగింది. ఇంత గందరగోళం జరుగుతున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బాధిత కుటుంబాన్ని చూసి వెళ్తుంటే ఇక్కడేవున్న ముఖ్యమంత్రి కనీసం కుటుంబాన్ని పలకరించి నాలుగు ఉపశమన మాటలు చెప్పకపోవటం వెనక మిస్టరీ ఏంటో ఎవరికీ తెలియలేదు. పైగా ఢిల్లీ టూర్ లో భాగంగా తెరాసపార్టీ నేత ఇంట్లో పెళ్ళికి వెళ్లారు. ఇక ఈ విషయంలో జాతీయ మీడియా కెసిఆర్ పై దుమ్మెత్తి పోశాయి. ‘దిశ’ సంఘటపై స్పందించలేదు కానీ ఢిల్లీ లో పెళ్ళికి వెళ్లారంటూ ఆయనను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఎప్పటికో దిశ ఘటన పై స్పందించినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఇదంతా గతం ఇప్పుడు సీన్ మారింది. ‘దిశ’ ఘటన వెనుక కెసిఆర్ మౌనం వీడింది. ఆయన ఉగ్రరూపం బయటపడ్డది. “దిశ” నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. విమర్శించిన వారే ఇప్పుడు కెసిఆర్ గ్రేట్ అంటున్నారు. ఆయనపై ప్రశంసల పరంపర మొదలైంది. కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేశామని నాలుక కరుచుకుంటున్నారు. “వేర్ ఈజ్ కెసిఆర్?” అనే పరిస్థితి నుండి “దట్ ఈజ్ కెసిఆర్” అనే లెవెల్ కి మారిపోయారు. విమర్శల జల్లు నుండి తప్పించుకొని ప్రశంసల వర్షంలో పడ్డాడు