
అదేంటి.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లా..? ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది.. ఇంతకీ ఎవరితో జరిగింది అనుకుంటున్నారా..? జరిగింది.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ఇండియన్ సినిమా నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. నాగార్జున, ప్రభు, శివరాజకుమార్ సహా అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీటిని షేర్ చేసింది కూడా నాగార్జుననే. అయితే ఇదంతా నిజం పెళ్లి మాత్రం కాదు.. నగల దుకాణం ప్రమోషన్ కోసం తీసిన యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా నటించింది.
అందులో నాగార్జునతో పాటు పలువురు సూపర్ స్టార్స్ కనిపించారు. అందులో కత్రిన పెళ్లి కూతురిగా కనిపించగా.. అమితాబ్, జయా బచ్చన్ ఆమె తల్లిదండ్రులుగా నటించారు. ఇక నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులుగా నటించారు. ఈ యాడ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.