జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్బంగా విజయవాడలో జాతీయ విద్య, మైనార్టీ దినో్త్సవం సభలో జగన్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని ప్రశ్నించారు. అయితే, జగన్ వ్యాఖ్యలకు జనసేన సోషల్ మీడియా టీం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్ ?’ అని జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని జనసేన అధికారిక ఖాతాలో రీ ట్వీట్ చేశారు.
మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా @PawanKalyan గారి పెళ్లిళ్ల వల్ల అంట నిజమా @ysjagan?#YSJagan #YSRCP pic.twitter.com/Mgxht9KKAI
— JanaSena Shatagni (@JSPShatagniTeam) November 11, 2019
ఇది మా సంస్కారం @PawanKalyan
JanaSena Chief responding to personal comments (last year). pic.twitter.com/3bzi81En5q
— JanaSena Party (@JanaSenaParty) November 11, 2019
అలాగే “దిగజారి పోతోన్న భాషాభిమానం” అంటూ సాక్షి పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ను పోస్ట్ చేస్తూ మరో ఘాటు విమర్శ చేసింది జనసేన.
“దిగజారి పోతోన్న భాషాభిమానం” అంటూ ఒకప్పుడు తాటికాయంత అక్షరాలతో రాసిన వాళ్లు,
అదే భాషాభిమానంతో పవన్ గారు గళమెత్తితే..
ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తి అయ్యిండీ,
సూటిగా సమాధానం చెప్పలేక,
పెళ్ళాలు, పెళ్లిళ్లూ అంటూ
దిగజారుడు భాష మాట్లాడుతూ,
వ్యక్తిత్వంలో పాతాళంలోకి దిగజారిపోతున్నారు! pic.twitter.com/PY6Gpq3PD5— Janasena Soldiers (@jssoldiers) November 11, 2019
One more article reflecting YCP’s hypocrisy then and now. pic.twitter.com/frHMdjJGWh
— Pawan Kalyan (@PawanKalyan) November 11, 2019
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని జగన్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
Check;YCP leader’s tweet when he was in the opposition ,contrary to what he says now. pic.twitter.com/lNZKVTXkyr
— Pawan Kalyan (@PawanKalyan) November 11, 2019
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. మెల్లమెల్లగా పదో తరగతి వరకు పెంచాలని భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేస్తున్నారంటూ అన్ని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే, ఈ వ్యాఖ్యలకు స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.