వాట్సాప్ గ్రూప్‌ల్లో, ఫేస్‌బుక్‌లో భారత ఆర్మీ జవాన్లకు అందమైన అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి రహస్యాలు దొంగిలించాలన్న దుర్బుద్ధి తో పాకిస్థాన్ సోషల్ మీడియాలో మన సైనికులను టార్గెట్ చేస్తోంది. ముసుగులో వల వేసి, సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఇలాంటి కేసులపై అలర్ట్ అయిన భారత ఆర్మీ.. వాట్సాప్ విషయంలోనూ అప్రమత్తమైంది. జవాన్లను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Indian Army issues advisory to personnel to change Whatsapp settings to avoid being added to Whatsapp groups by Pakistani Intelligence Operatives. Advisory issued after an Army person was added to a Whatsapp group automatically by a suspected Pakistani number. pic.twitter.com/NPGrrhIRAQ
— ANI (@ANI) November 22, 2019
ఓ జవాన్‌ను తనకు తెలియకుండానే పాక్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేశారు పాక్ ఐఎస్ఐ ఏజెంట్స్. +92తో మొదలయ్యే ఓ పాక్ నంబర్ ఆర్మీ జవాన్‌ను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని పోలీసులకు, ఆర్మీకి తెలియజేశాడు. పాక్ కొత్త కుట్రలు తెలియడంతో భారత ఆర్మీ వాట్సాప్ వినియోగంపై అడ్వైజరీ విడుదల చేసింది. గ్రూప్‌లో యాడ్ చేయడానికి సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోవాలని సూచించింది.
+92తో మొదలయ్యే ఏ నంబర్‌ను కనిపించినా వెంటనే అది పాకిస్థాన్‌దని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వారి గ్రూప్‌లలో యాడ్ చేయకుండా చూసుకోవాలని తెలిపింది.
తెలియనివాళ్లు వాట్సాప్‌లో యాడ్ చేయకుండా సెట్టింగ్స్‌లో అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ఓపెన్ చేస్తే.. లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, అబౌట్, రీడ్ రిసిప్ట్స్, గ్రూప్స్, లైవ్ లొకేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో గ్రూప్స్ ఓపెన్ చేసి.. నో బడీ లేదా మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అసలెవరూ వాళ్ల గ్రూప్‌లో మన పర్మిషన్ లేకుండా యాడ్ చేయడం కుదరదు.
అదే మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే మన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌లో ఎవరైనా మనల్ని యాడ్ చేయడం వీలవుతుంది.