
ప్రియాంకరెడ్డిను లారీ డ్రైవర్లతోపాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్యచేసినట్లు నిర్ధరించారు. నిందితులను నారాయణపేట జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సమయంలో హత్యచేసి ఉంటారని శవపరీక్షలో తేలింది. అంతేకాకుండా ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ప్రియాంక రెడ్డిని కిరోసిన్ పోసి చంపినట్లు డాక్టర్లు చెప్పడంతో లారీ డ్రైవర్లే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శరీరం గంటపాటు తగలబడినట్లు వైద్యులు భావిస్తున్నారు. మెడను చున్నీతో బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రియాంకరెడ్డి తలపైనా వైద్యులు గాయాన్ని గుర్తించారు.
