Yogi Adityanath : యోగి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ 8 ఏళ్లలో ఆయన సాధించిన మొదటి ఘనత ఏదని అంటే. ‘మాఫియా రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాడు. సమాజ్ వాదీ పార్టీ నేర సామ్రాజ్యాన్ని ఏరిపారేశాడు. జిల్లాకో మాఫియా ఉండేది. ఆ స్థితిని మార్చి.. మాఫియాను అంతం చేసిన ఘనత యోగిదీ..
25 నుంచి 28 వరకూ మూడు రోజుల పాటు యోగి 8 ఏళ్ల పాలనను వేడుకగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం తర్వాత యోగి అధికారంలోకి వచ్చినప్పుడు యూపీ చివరలో ఉండేది. ఆర్థిక ప్రగతి ఉండేది కాదు.. కానీ ఇప్పుడు దేశంలోనే నంబర్ 2 స్థాయికి ఎదిగింది.
2016-17లో యూపీ బడ్జెట్ రూ.3.46 లక్షల కోట్లు.. మన తెలుగు రాష్ట్రాల్లో అంత.. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ రూ.8 లక్షల 8వేల కోట్లు. దేశంలోనే అత్యధిక బడ్జెట్ ఇదీ.. మహారాష్ట్ర కంటే ఎక్కువ. 2016లో జీఎస్.డీపీ 12.89 లక్షల కోట్లు ఉంటే.. ప్రస్తుతం యూపీ జీఎస్.జీడీపీ 27.57 లక్షల కోట్లకు చేరింది. నిరుద్యోగ రేటు 2016లో 18 శాతం ఉంటే.. ఈరోజు 3 శాతానికి తగ్గింది.
8 ఏళ్ళ యోగి పాలన ఉత్సవాలు ఎందుకు ప్రత్యేకం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.