Royal Enfield Classic 650: ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 350సీసీ సెగ్మెంట్‌లో బుల్లెట్, క్లాసిక్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు సూపర్ మీటియోర్ 650, బేర్ 650, షాట్‌గన్ 650, కాంటినెంటల్ జీటీ, ఇంటర్‌సెప్టర్ 650 వంటి 650సీసీ బైక్‌లు కూడా ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌లో తమదైన ముద్ర వేశాయి. ఇప్పుడు ఈ 650 సీసీ శ్రేణిలోకి మరో కొత్త మోటార్‌సైకిల్ రాబోతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 రేపు, అంటే మార్చి 27న భారత మార్కెట్‌లో విడుదల కానుంది.
Also Read : కారు కొనాలని చూస్తున్నారా.. ఈ ఐదు రాష్ట్రాల్లో డెడ్ ఛీప్
క్లాసిక్ 650 పవర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ కొత్త బైక్‌లో 648 సీసీ, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. క్లాసిక్ 650లో ఉన్న ఈ ఇంజన్ 47 హెచ్‌పి పవర్‌ను, 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్ ఇంజన్‌ను ఇదివరకే టెస్ట్ చేశారు.
క్లాసిక్ 650 పవర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఉన్న 349 సీసీ ఇంజన్ 6,100 ఆర్పీఎమ్ వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్‌ను, 4,000 ఆర్పీఎమ్ వద్ద 27ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజన్‌తో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా వస్తుంది.
క్లాసిక్ 650 పవర్ ఎంత ఎక్కువ?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 పవర్.. అంతకు ముందున్న క్లాసిక్ 350తో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ. ఈ కొత్త బైక్ క్లాసిక్ 350 బైక్‌లో ఉన్న ప్యారలల్ ట్విన్ ఇంజన్ కలయికగా భావించవచ్చు. క్లాసిక్ 350 ఒక లీటర్ పెట్రోల్‌పై 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతుంది. ఇక 650 సీసీ బైక్‌ల విషయానికి వస్తే షాట్‌గన్ 650, లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లీటరుకు 21.45 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని అంచనా.
క్లాసిక్ 650 ధర ఎంత ఉండవచ్చు?
క్లాసిక్ 650 ధర సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650 ధరలకు దగ్గరగా ఉండవచ్చు. షాట్‌గన్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ.3.59 లక్షల నుంచి, సూపర్ మీటియోర్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ.3.40 లక్షల నుంచి రూ.3.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. క్లాసిక్ 350 ప్రారంభ ధర రూ.1,93,080 నుంచి రూ.2.30 లక్షల వరకు ఉంది. రేపు విడుదల కానున్న ఈ బైక్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : టెస్లాకు మించిన ఆ కారు ప్లాంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం…