Rahul Gandhi leader of opposition: మూడ్ ఆఫ్ ది నేషన్.. ఇండియా టుడే మ్యాగజైన్ ప్రతీ ఆరునెలలకు ఓసారి ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. 23 ఏళ్లుగా నడుపుతోంది. చాలా పాపులర్ ఓపినియన్ పోల్ సర్వే. ఇందులో రెండు గమనించాలి.
రాహుల్ గాంధీకి 28 శాతం, మమతా బెనర్జీకి 8 శాతం.. అఖిలేష్ కు 7 శాతం, అరవింద్ కేజ్రీవాల్ కు 6 శాతం ప్రజాదరణ దక్కింది. రాహుల్ గాంధీకి అందరికంటే ఎక్కువగా ప్రజాదరణ ఈసారి ఉందని ఓపినియన్ పోల్స్ లో తేల్చారు.
బెస్ట్ సూటెడ్ పీఎం ఎవరు అని ఓపినీయన్ పోల్ లో అడిగితే.. మోడీకి 52 శాతం రాగా.. రాహుల్ గాంధీకి 25 శాతంవచ్చింది. ఇద్దరి మధ్య గ్యాప్ 27 శాతం ఉంది. రాహుల్ ను కోరుకున్న వారికంటే గ్యాప్ నే ఎక్కువగా ఉంది. రాహుల్ ఒక మెట్టు ఎక్కాడు. ప్రతిపక్షాలకు నాయకుడు అయ్యాడు.
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ల ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోయింది. ప్రతిపక్షాలకు నాయకులుగా పడిపోయారు. రాహుల్ క్రేజ్ అమాంతం పెరగడం విశేషం.
ప్రతిపక్షాల నాయకుడు రాహుల్ గాంధీ ప్రజా నాయకుడిగా మారతాడా? అన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
