Kavitha Flixi Burn Video: గులాబీ పార్టీలో ఉండి.. అధినేత ఆగ్రహానికి గురై సస్పెండ్ అయిన నాయకుల దిష్టిబొమ్మలను పింక్ పార్టీ కార్యకర్తలు అప్పట్లో దహనం చేశారు. అంతేకాదు నోటికి వచ్చినట్టుగా విమర్శలు చేశారు. సరే ఆ పార్టీ నాయకత్వం లైన్ దగ్గర వారు వ్యవహరించారు. అందులో తప్పులేదు. తప్పు పట్టడానికి కూడా లేదు.
కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జాగృతి అధినేత్రిని సస్పెండ్ చేయడమే ఆలస్యం.. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు గులాబీ కార్యకర్తలు.. అంతేకాదు కవిత దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి తగలబెట్టడం కూడా ప్రారంభించారు. నిన్న ఎవరి మీదయితే కవిత ఆరోపణలు చేశారో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోని హుస్నాబాద్ లో గులాబీ పార్టీ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని తారాస్థాయిలో చూపించడం మొదలుపెట్టారు. కవిత దిష్టిబొమ్మను ఏర్పాటు చేయడమే కాదు.. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ తగలబెట్టారు.
వాస్తవానికి గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ ప్రాంతంలో దిష్టిబొమ్మలను తగలబెట్టే సంస్కృతి మొదలైంది. 10 సంవత్సరాలు భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు అంతగా దిష్టిబొమ్మలను ఇక్కడ తగలబెట్టలేదు.. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలోని కీలకమైన నాయకురాలు దిష్టిబొమ్మను తగలబెట్టడం నిజంగా ఆశ్చర్యకరంగా మారింది. అయితే కొంతకాలంగా కవిత వ్యవహార శైలి పట్ల ఆగ్రహం గా ఉన్న గులాబీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఇన్నాళ్లు దాచుకున్న అసహనం మొత్తాన్ని వ్యక్తం చేయడం విశేషం.. ఇదే సమయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రికి వారంతా అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.. అంతేకాదు జాగృతి అధినేత్రి ఏర్పాటు చేయబోయే పార్టీలో ఎవరూ చేరబోరని వారు చెబుతుండడం విశేషం.
కవిత దిష్టిబొమ్మ దహనం వెనుక ఓ ప్రధాన నాయకుడు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే పార్టీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుందో.. అప్పుడే వాట్సప్లో ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఓ మాజీ మంత్రి అనుచరులు మొత్తం రెచ్చిపోయారని.. కవితపై బూతుల దండకం మొదలు పెట్టారని.. మాజీ మంత్రికి తమ అండగా ఉన్నామని.. ఇంకోసారి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు..
హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన..
హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు..
కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం.
పార్టీ నాయకులను… pic.twitter.com/uErO329UvM
— Telugu Reporter (@TeluguReporter_) September 2, 2025