Western World : పాశ్చత్య ప్రపంచం.. మొదటి నుంచి రెండు నాల్కల ధోరణినే. ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పేది. ఆధునిక ప్రజాస్వామ్యం పేరుతో మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు. తోటి నల్లజాతీయులను బానిసలుగా వాడుకొని దోచుకున్న పాశ్చాత్య దేశాలు. ఆసియా, ఆఫ్రికా దేశాలను వశపరుచుకొని దారుణంగా పాలించిన ఘనత పాశ్చాత్య దేశాల వారివి.
ఉగ్రవాదంపై చెప్పేదొకటి.. చేసేదొక్కటిగా పాశ్చత్య దేశాల వైఖరి ఉంది. మీ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ ను చంపిన అమెరికా.. అదే పాకిస్తాన్ లో ఉంటున్న కరుడుగట్టిన ఉగ్రవాదులు హఫీజ్ సయాద్ ను, మౌలానా మసూద్ హాజర్ లను ఎందుకు చంపరు.. అదే పాకిస్తాన్ కు పెద్దన్న పీట వేస్తారా? ఏ కారణం లేకుండా ఇరాక్ లాంటి దేశాన్ని ఆక్రమించుకోవచ్చు. ఏ కారణం లేకుండా ఇతర దేశాల ప్రభుత్వాధినేతలను కూల్చివేయవచ్చు.ఎన్నికైన బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చింది అమెరికన్ డీప్ స్టేట్.
ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్ కు మద్దతు ఇవ్వాల్సింది పోయి నూట్రల్ గా మాట్లాడడం ఏ విధమైన సంస్కృతి.. ఏవిధంగా మీరు చెప్పే పాఠాలు అప్లై కావో చెప్పాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు గౌరవం ఇవ్వడం దొంగ విధానం కాదా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ఆంక్షలు విధించకుండా వదిలేసింది ఇదే పాశ్చాత్యదేశాలు..
ద్వంద ప్రమాణాల పాశ్చాత్య ప్రపంచం మనకు నీతులు చెబుతుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.