రాహుల్ గాంధీది ఏకపక్ష ధోరణి.. ఆయనకు నోరు ఉంది కానీ చెవులు లేవు. నోటికి ఏది పడితే అది ఆధారాలు లేకుండా మాట్లాడుతాడు. మిగతావాళ్లు చెబితే వినడు. ఎవరైనా మాట్లాడితే రాహుల్ కు కనపడదు.
కొన్ని ఉదాహరణలు చెబితే.. మహారాష్ట్ర ఎన్నికల గురించి రాహుల్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. కోటి మంది కొత్త ఓటర్లు మహారాష్ట్రలో ఉన్నారని రాహుల్ చెబితే ఈసీ వివరణ ఇచ్చింది. కేవలం 38 లక్షల మందే కొత్త ఓటర్లు అని.. రాహుల్ ఆరోపించినట్టు కోటి మంది లేరని ఈసీ వివరణ ఇచ్చింది.గణాంకాలతో ఈసీ వివరించినా రాహుల్ విమర్శలు ఆపడం లేదు.కేవలం 4 శాతం కొత్త ఓట్లు మాత్రమే యాడ్ అయ్యాయి..
మహారాష్ట్రలో 50వేలు పైబడిన కొత్త ఓటర్లు ఉన్నది కేవలం 6 నియోజకవర్గాలకే 40కిపైగా నియోజకవర్గాలని రాహుల్ ఆరోపిస్తున్నారు. పెరిగిన ఓట్లతో అన్ని పార్టీల అభ్యర్థులు గెలిచారు. రాహుల్ ఆరోపణల్లో వాస్తవం లేదు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నే కాదు తోటి పార్టీలనూ ముంచుతున్నాడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.