Tirumala Gold Donation : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు( Lord Sri Venkateswara ). భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు శ్రీనివాసుడు. మొక్కుల స్వామిగా కూడా పేరుగాంచాడు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వస్తుంటారు. స్వామివారికి కానుకల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఓ అజ్ఞాత భక్తుడు వెంకటేశ్వర స్వామి వారికి ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా అందజేశాడు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరిలో జరిగిన పి 4 కార్యక్రమంలో భాగంగా కీలక ప్రసంగం చేశారు చంద్రబాబు. త్యాగం, మనకు వచ్చే ఆదాయంలో సేవా రంగానికి, పేదరికం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక షరతు పెడుతూనే ఓ అజ్ఞాత భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చిన బంగారం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఏపీ ఫ్రీ బస్ స్కీం : మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
భారీగా సక్సెస్ రావడంతో..
‘ఓ వ్యక్తి ఒక పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఆ పరిశ్రమ( industry) ఏర్పాటు చేయకముందు స్వామివారికి వేడుకున్నాడు. స్వామి వారి ఆశీస్సులతో ఏర్పాటు చేశాడు. అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయ్యాడు. తరువాత తన కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ అంటే.. సుమారుగా ఆరు ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. దీంతో శ్రీవారి దయవల్ల తనకు ఇదంతా వచ్చిందని.. తన వంతుగా స్వామివారికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. దీంతో 121 కేజీల బంగారాన్ని స్వామివారికి విరాళంగా ఇచ్చాడు. అంతేకాకుండా తన పేరు మాత్రం ఎక్కడ బయటకు రావద్దని చెప్పి మరి ఆ బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు’ అంటూ చంద్రబాబు అసలు విషయం బయటపెట్టారు. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి రోజుకు 120 కిలోల ఆభరణాలు ధరిస్తారు. కానీ సదరు అజ్ఞాత భక్తుడుకు ఆ విషయం తెలియదని.. కానీ అంత బంగారం ఆ ఒక్క వ్యక్తి ఇచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఏపీలో ఫ్రీ బస్.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
ప్రతిష్టాత్మకంగా పి4
ఏపీలో జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తిగా చంద్రబాబు( AP CM Chandrababu) ‘బంగారు కుటుంబాలు- మార్గదర్శకులు’ పథకాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు.. నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పి 4 పేరిట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పై ప్రత్యేకంగా సమీక్ష జరిపారు చంద్రబాబు. ఆ సందర్భంలోనే ఈ అజ్ఞాత వ్యక్తి పారి సాయం గురించి ప్రకటించారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు.. సమాజంలో ఉన్నత రంగాల వారు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.