తెలుగు సినిమాలు పల్లెటూరి జీవితాలపై .. పల్లెబాట పట్టడంపై ఇతివృత్తంతో తీసినవి సూపర్ హిట్ అయ్యాయి. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి. అది ప్రజల కళ. పల్లెటూర్లు అలా ఉండాలి. అదే స్వర్గసీమ అని ప్రజలు భావిస్తున్నారు.
నిజజీవితం అలా లేదు. పల్లెలు రోజురోజుకు కళ తప్పుతోంది. జనం పల్లె టూరి నుంచి నగర బాట పడుతున్నారు. పల్లెటూళ్లు కాలుష్య రహిత కేంద్రాలుగా ఉంటున్నాయి. కానీ నగరాల్లో రక్షిత మంచినీటి సరఫరాల పథకం గ్రామాల్లో లేకపోవడం.. కలుషిత నీరు తాగి గ్రామాల్లో అనారోగ్యాలు.. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాల లేమి గ్రామాల్లో వేధిస్తోంది. మోడీ ఇటీవల వెల్ నెస్ సెంటర్స్ అని పెట్టారు. ఆ అవకాశాన్ని ఏపీ వాడుకుంటోంది.
శాశ్వత రోడ్డు సౌకర్యం చాలా ముఖ్యం. అత్యవసరం వేళ నగరాలకు వెళ్లడం.. మంచి హంగులున్న పాఠశాలలు ఉంటే పల్లెలే స్వర్గ సీమలు కదా.. సినిమాల్లో చెప్పేదే నిజజీవితంలోనూ జరుగుతాయి. ఇవన్నీ పల్లెల్లో లేకపోవడానికి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు మనకు లేకపోవడం మైనస్ గా మారింది. ఇవాళ పవన్ పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకోవడంతో ఏపీలో పల్లెలు పునర్వైభవం తెచ్చుకున్నాయి.
పవన్ కళ్యాణ్ చొరవతో తిరిగి ఆశలు చిగురించిన పల్లె జీవితంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
