Vijay TVK party meeting: తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నాయి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మూడు కూటములు పోటీచేశాయి. డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్డీఏ -అన్నామలై కూటములు పోటీపడ్డాయి. అప్పుడు బీజేపీకి 11 శాతం, కూటమిగా 18 శాతం వచ్చాయి. అన్నాడీఎంకేకు 23 శాతం వచ్చాయి. దక్షిణ తమిళనాడులో 3వ స్థానంలో అన్నాడీఎంకే ఉండగా.. బీజేపీ 22 శాతంతో 2వ స్థానంలోకి వచ్చింది.
అలాగే కోయంబత్తూరు సిటీలోనూ బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. చెన్నై సౌత్, సెంట్రల్ లోనూ బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. అన్నాడీఎంకే ఈ చోట్ల 3వ స్థానంలోకి వెళ్లింది. అంటే ట్రయాంగిల్ పోరు నడిచింది.
ఈ మూడింటి మధ్య పోరు నడిచింది. ఇప్పటికీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అన్నాడీఎంకే తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఇప్పుడు తమిళనాట రెండు కూటములే అనుకున్నారు. కానీ హీరో విజయ్ ‘టీవీకే’ పార్టీ రావడంతో మూడో కూటమి తెరపైకి వచ్చింది.
ఈ నెల మదురై సమావేశంతో హీరో విజయ్ జనం మధ్యకు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
