Sridevi Drama Company Latest Episode: బుల్లితెర మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ షోస్ కి జనాల్లో ఉండే క్రేజ్ తో పోలిస్తే సినిమాలకు ఉన్న క్రేజ్ చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈటీవీ ఛానల్ నుండి ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు మన సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. కొంతమంది ఆర్టిస్టులకు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, ఇంకా బుల్లితెర కి మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి ఆర్టిస్టులలో ఒకరు పంచ్ ప్రసాద్(Punch Prasad). ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైనా ఈయన, ఇప్పటికీ జబర్దస్త్ షో లోనే కొనసాగుతూ ఉన్నాడు. మధ్యలో ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడం, దాదాపుగా ప్రాణాలు పొయ్యే స్థితి నుండి దేవుడి దయ వల్ల మళ్ళీ క్షేమంగా ఆరోగ్యంతో బయటపడడం, బుల్లితెర పై మళ్ళీ తన పంచులతో ఆడియన్స్ ని అలరించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న స్నేహితుల దినోత్సవం అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read: పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…
ఈ సందర్భంగా గతం లో పంచ్ ప్రసాద్ ‘స్నేహమేరా జీవితం’ అనే ప్రోగ్రాం లో తన స్నేహితులను పరిచయం చేస్తూ వేసిన కొన్ని పంచులు నిన్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆ వీడియో ని షేర్ చేశారు. దీనిని చూసిన ప్రతీ ఒక్కరు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతున్నారు. ఆ వీడియో లో ఏముందో చూద్దాం. ముందుగా పంచ్ ప్రసాద్ తన స్నేహితుడిని పరిచయం చేస్తూ ‘నా కోసం వాడు ఉద్యోగం వదిలేసుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది జీతం తక్కువ ఇస్తున్నారని మానేశాడని’ అని అంటాడు. ఈ పంచ్ కి ఆ షో లో ఉన్న వారంతా పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత పంచ్ ప్రసాద్ స్నేహితుడు మాట్లాడుతూ ‘నాకు ప్రసాద్ ఒక అన్నయ్య లాంటోడు. నా ఫ్యామిలీ మెంబెర్, నా బెస్ట్ ఫ్రెండ్’ అని అంటాడు. అప్పుడు పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ ‘చెప్పకపోయినా పర్వాలేదు కానీ, వరసలు మార్చకురా, బావా అంటావ్, అన్నయ్య అంటావ్’ అని అంటాడు.
Also Read: డ్యాన్స్ లో చిరంజీవిని దాటేసిన తాత..’ఢీ’ కంటెస్టెంట్స్ గుండెల్లో దడ పుట్టించాడుగా!
మళ్ళీ ప్రసాద్ స్నేహితుడు మైక్ అందుకొని ‘ప్రసాద్ నా స్నేహితుడు..నా బిగ్ సప్పోర్ట్,మాటల్లో ఇంకేమి చెప్పలేను, హీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయస్ట్ ఫ్రెండ్’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు ప్రసాద్ మాట్లాడుతూ ‘థాంక్యూ..ఈడి బొక్క..ఈడు ఇలా చేస్తాడని ముందే తెలిసి ఉండుంటే వేరే వాళ్ళని పిలిచేవాడిని’ అంటూ పంచ్ వేస్తాడు. అంతే ఆ షో లో ఉన్నవారంతా క్రిందపడి దొర్లాడి మరీ నవ్వుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి పంచులు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి హైపర్ ఆది కూడా సోఫా లో నుండి పైకి లేచి మరీ నవ్వుకున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసి నవ్వుకోండి.
Emotional damage #HappyFriendshipDay pic.twitter.com/OzSSbRN2Nb
— We Love Chiranjeevi (@WeLoveMegastar) August 3, 2025