Hrithik Roshan on Jr NTR Dance: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అద్భుతంగా డ్యాన్స్ వెయ్యగల హీరోల లిస్ట్ తీస్తే మన టాలీవుడ్ నుండి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఆయన లావుగా ఉన్న రోజుల్లోనే డ్యాన్స్ దుమ్ము దులిపేవాడు. ఇక సన్నగా అయ్యాక ఎలా ఉంటుందో మనమంతా యమదొంగ నుండి చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ తో సమానంగా డ్యాన్స్ చేయగల హీరోలు మన టాలీవుడ్ నుండి రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అయితే, బాలీవుడ్ నుండి హృతిక్ రోషన్(Hrithik Roshan) ఉంటాడు. ఆయన డ్యాన్స్ లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఎలాంటి తోపు డ్యాన్సర్ ని అయినా తన మ్యాజిక్ తో డామినేట్ చేయడం హృతిక్ రోషన్ స్టైల్. స్పీడ్, గ్రేస్, స్టైల్ ఇలా అన్ని యాంగిల్స్ లోనూ ఆయన దుమ్ము దులిపేసాడు.ఆయన ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలి అనేది కోట్లాది మంది సినీ అభిమానుల కల.
ఆ కల త్వరలోనే ‘వార్ 2′(War 2 Movie) రూపం లో నెరవేరబోతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఈ చిత్రానికి కావాల్సిన హైప్, క్రేజ్ మాత్రం రావడం లేదు. అభిమానులంతా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేసిన పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పాట ని ఫైనల్ షెడ్యూల్ లో చిత్రీకరించారు. రీసెంట్ గానే ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్, ఈ పాట గురించి, అదే విధంగా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఒక గొప్ప డ్యాన్సర్ మరో గొప్ప డ్యాన్సర్ గురించి గొప్పగా మాట్లాడడం చూస్తుంటే ఆడియన్స్ కి చాలా ముచ్చటేసింది.
Also Read: ఈ ఏజ్ లో రజినీకాంత్ హీరోగా సినిమాలు చేయడం కరెక్టేనా..?
ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ అసాధారణమైన డ్యాన్సర్. నేను ఆయన డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్ ని. నేను మొట్టమొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 చిత్రం లో నటించాను. మా ఇద్దరి మధ్య ఒక డ్యాన్స్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఎన్టీఆర్ స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడం చాలా కష్టం. అతనికి అసలు రిహార్సల్స్ కూడా అవసరం లేదు, అతని లోపలే డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. మొదట్లో ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే కాస్త భయపడ్డాను కానీ, ఆ తర్వాత దానిని నేను ఛాలెంజ్ గా తీసుకొని డ్యాన్స్ చేశాను. ఆ పాట అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కూడా గతం లో ఒక ఇంటర్వ్యూ లో హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ ఆయన డ్యాన్స్ ముందు నాదెంత?, ఆయన ఒక లెజెండ్, ఆయన ముందు నేను పనికిరాను అంటూ చెప్పుకొచ్చాడు.
#HrithikRoshan about #JrNTR dance in face off song#War2 pic.twitter.com/zi8jbPvhps
— CHITRAMBHALARE (@chitrambhalareI) August 4, 2025