https://oktelugu.com/

Pawan Kalyan : కాకినాడ పోర్ట్ వివాదం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని దేశవ్యాప్త సంచలనం

Pawan Kalyan : కాకినాడ పోర్ట్ వివాదం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని దేశవ్యాప్త సంచలనంగా మారింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2024 / 08:50 PM IST

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ తీరంలో సముద్రంపై చేసిన సాహసం అక్కడి వరకే పరిమితం కాలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర అద్భుతం అమోఘం అని అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు దానిని లింక్ గా చేసుకొని కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ దందా వ్యవహారాలన్నింటిని పవన్ కళ్యాణ్ దేశం దృష్టికి తీసుకొచ్చినట్టైంది.

    వైఎస్ జగన్ పాలనలో ఇక్కడ ఏం జరిగింది? ఆయన పాలనలో జరిగిన అవినీతిపై దేశవ్యాప్తంగా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. కాకినాడ ప్రైవేటు పోర్టులో జరుగుతున్న అన్ని వ్యవహారాలను పవన్ బయటపెట్టడంతో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి.

    పవన్ గైడెన్స్ లో జనసేన పార్టీ ఈ కాకినాడ పోర్టు లొసుగులు అన్నీ బయటకు లాగింది. పక్కా ఆధారాలతో జగన్ కోటరీని పవన్ ఇరికించినట్టే.. సినీ ఫక్కీలో పవన్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది.

    కాకినాడ పోర్ట్ వివాదం పవన్ కళ్యాణ్ పుణ్యమా అని దేశవ్యాప్త సంచలనంగా మారింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.