Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటీవల జలజీవన్ మిషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా వచ్చిన నిధులను ఉపయోగించుకోలేకపోయాం.. గ్రామీణులకు తాగునీరును అందించలేకపోయామని చెప్పుకొచ్చాడు.
నిన్న పార్లమెంట్ లో కేంద్రం జవాబిచ్చింది. జలజీవన్ మిషన్ కింద మొత్తం 16855 కోట్లను కేంద్రం గడిచిన ఐదేళ్లలో కేంద్రం కేటాయిస్తే.. కేవలం 2254 కోట్లు మాత్రమే వాడుకున్నారు. కేవలం 13 శాతం నిధులు ఏపీ వాడుకుంది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఏపీ చేతులెత్తేసిన వైనం విస్తుగొలుపుతోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు జలజీవన్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 29వ రాష్ట్రంగా నిలవడం దారుణమనే చెప్పాలి. తాగునీటి కల్పనలో దేశంలోనే ఏపీ వెనుకబడి ఉండడం మన గత పాలకుల నిర్లక్ష్యానికి తార్కాణంగా చెప్పొచ్చు.
70వేల కోట్లతో గ్రామాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా సాగుతున్న కూటమి ప్రభుత్వం తీరుపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.