YS Vivekananda Reddy Case : సంచలనంగా మారిన ఏపీ మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన అనుచరులైన సునీల్ రెడ్డి, ఉదయ్ తదితర 300 మందిని పైగా విచారించింది. కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. ఇంతకీ సీబీఐ ఏం ప్రశ్నలు సంధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా వివేకా హత్యకు చుట్టూనే సీబీఐ ప్రశ్నలు వేసింది. అందుకు గల కారణాలను అనుమానితులుగా భావిస్తున్న వారికి సంధించింది. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత వివాదాలు, సాక్ష్యాలు ఎందుకు చెరిపేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే చేశారు వంటి ప్రశ్నలను వేయడం జరిగింది.
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాత ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్పటికి ఐదుసార్లు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈ రోజు మరలా ఆయన సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆయన బెయిల్ పిటీషన్ ను తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది. విచారణకు ఆయన సహకరించడం లేదని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, విచారణకు సహకరించాలని కోర్టు పేర్కొంది. సీబీఐ అధికారుల ప్రశ్నలను లిఖితపూర్వగా తెలియజేయాలని, అవినాష్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సూచించింది.భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తరువాత, తనను అరెస్ట్ చేయొద్దంటూ పదేపదే అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. హైకోర్టులో కాస్త ఊరట లభించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ ఆంధ్రా రాజకీయాలు సాగుతున్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.