MLC Kavitha : రాజకీయ నాయకుల్లో సున్నితత్వం బాగా తగ్గిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. సాధారణంగా సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే లేదా జైలు జీవితం గడిపితే బయటకు రావడానికి సిగ్గుపడతారు. కొందరు అయితే ఇంటి నుంచి కూడా బయటకు రారు. అయితే, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, ఏమీ జరగనట్టుగా ఒక సెలబ్రిటీలా వ్యవహరిస్తూ, గర్వంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
తాజాగా, ఆమె ఒక ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి 14 నెలలు జైలు జీవితం అనుభవించి కూడా స్వాతంత్ర్య సమరయోధుడిలా చేతులు ఊపుకుంటూ బయటకు వచ్చారని గుర్తు చేస్తున్నారు.
అదే పాడ్‌కాస్ట్‌లో కవిత, జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన కష్టాలను అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. కానీ పవన్ కళ్యాణ్‌ను మాత్రం తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో నటిస్తున్న నాయకుడు అంటూ ఆయనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
“పాలిటిక్స్‌లో జోకర్”, ఏదో అదృష్టవశాత్తూ డిప్యూటీ సీఎం అయ్యారని, ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, మాట మీద నిలబడరని కవిత ఇష్టానుసారంగా పవన్‌ను దూషించారు.
సోషల్ మీడియాలో కవిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకున్న కవిత తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
