Vizag Steel Plant : విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో పబ్బం గడుపుకుంటున్న ఆంధ్రా రాజకీయాలు

విశాఖ స్టీల్ కోసం మోడీ పదార్థాలు లేదా మూలధనం కోసం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)ని కేంద్రం జారీ చేసింది. ఇది ఎప్పుడైతే జారీ అయిందో అప్పుడే కేసీఆర్ అండ్ కో అలర్ట్ అయింది. సింగరేణిని రంగంలోకి దించుతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చింది. అదే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తనకు అలవాటైన రాజకీయాలకు తెర లేపారు. ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ విషయాన్ని పక్కన పెట్టి సింగరేణి ద్వారా వైజాగ్ స్టీల్ కొంటున్నట్టు, […]

Written By: NARESH, Updated On : April 25, 2023 5:00 pm
Follow us on

విశాఖ స్టీల్ కోసం మోడీ పదార్థాలు లేదా మూలధనం కోసం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)ని కేంద్రం జారీ చేసింది. ఇది ఎప్పుడైతే జారీ అయిందో అప్పుడే కేసీఆర్ అండ్ కో అలర్ట్ అయింది. సింగరేణిని రంగంలోకి దించుతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చింది. అదే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తనకు అలవాటైన రాజకీయాలకు తెర లేపారు. ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ విషయాన్ని పక్కన పెట్టి సింగరేణి ద్వారా వైజాగ్ స్టీల్ కొంటున్నట్టు, అక్కడి ప్రజల బతుకులు మార్చబోతున్నట్టు తన సొంత పత్రికలో రాసుకొచ్చారు. నిజంగా వైజాగ్ స్టీల్ ను కొనేంత ఆర్థిక దన్ను సింగరేణి వద్ద ఉన్నదా? అంత ఆర్థిక సంపత్తి ఉంటే కార్మికులకు బోనస్ ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద ఎందుకు అప్పులు తీసుకొస్తోంది? ఈ ఈ విషయాన్ని కెసిఆర్ సర్కార్ ఎందుకు దాచిపెడుతోంది? అనేవే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలు.

వాస్తవానికి గత కొద్దిరోజుల నుంచి విశాఖ ఉక్కు చుట్టూ వింత వింత ప్రచారాలు, విచిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మగారాన్ని కేంద్రం అమ్మేయడానికి ప్రయత్నిస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి క్యాలరీస్ తో బిడ్ వేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు వాస్తవం వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. “ముడి పదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చితే దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తాం. ఆసక్తి ఉన్నవాళ్లు ముందుకు రండి” అని విశాఖ స్టీల్స్ “ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన” జారీ చేసింది. అంతే తప్ప ఇది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కాదే కాదు.

విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో పబ్బం గడుపుకుంటున్న ఆంధ్రా రాజకీయాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..