Tamil Nadu : తమిళనాడులో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నది జరుగబోతోంది. ఎంకే స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను అధికారికంగా వారసుడిగా ప్రకటించబోతున్నాడు. ఆగస్టు మొదటి వారంలోనే ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయబోతున్నారు.
డీఎంకే పార్టీ కూడా కుటుంబ పార్టీగానే మారిపోయింది. డీఎంకే ను స్టాట్ చేసిన అన్నాదురైకి గ్లోబల్ ఐడియాలు ఉన్నా .. స్వార్థం లేకున్నా.. కరుణానిధి చేతుల్లోకి డీఎంకే పార్టీ వచ్చాక పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయింది.
ద్రవిడియన్ ఐడియాలజీని అడ్డం పెట్టుకొని డీఎంకేను నడిపించుకుంటూ వచ్చారు. 2016లోనే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయనిధి త్వరగా పైకి ఎదిగారు. ఎంకే స్టాలిన్ ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. పట్టుకొని నడుస్తున్నారు. తనకు ఏం అవుతుందోనన్న ఆందోళనల నేపథ్యంలోనే తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కు తమిళనాడు సీఎం పగ్గాలు అప్పగించాలని ఎంకే స్టాలిన్ యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే ముందుగా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్’ అవుతాడా లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.