BJP new working president: బీజేపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎన్నికయ్యారు. ఆల్ ఇండియాలో వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఇతడే జాతీయ అధ్యక్షుడిగా కాబోతున్నాడని అంటున్నారు. జేపీ నడ్డా కూడా ఇలానే వచ్చాడు. 45 ఏళ్ల కుర్రాడిని జాతీయ అధ్యక్షుడిని చేయడం అనేది కొత్త తరాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు.
రాజ్ దీప్ లాంటి జర్నలిస్టులు, మేధావులు దీనిపై కొత్త థియరీని తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ మైలేజ్ వస్తుందో బీజేపీకి అని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 85 ఏళ్ల కురువృద్ధుడు ఖర్గే కాంగ్రెస్ కు ఉండగా.. 45 ఏళ్ల వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా చేయడం పై మీడియా, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి. ఇదంతా మోడీ, షాలు తమ ఇష్టానుసారంగా చేస్తున్న నియామకాలు అంటూ మండిపడుతున్నాయి.
రాష్ట్రపతులు చూస్తే.. రామ్ నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్ము , ముఖ్యమంత్రులుగా ‘భజన్ లాల్ శర్మ’, విష్ణుకుమార్ సాయి, మోహన్ కుమార్ మాంజీ, .. ఎవ్వరూ పసిగట్టని వారిని మోడీ తీసుకొస్తాడని.. ఇప్పుడు కూడా నియంతలా మోడీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, మేధావులు విమర్శిస్తున్నారు.
బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడి నియామకంపై కు వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
