Dhurandhar box office collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. రోజురోజుకి ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూస్తే, అసలు ఈ సినిమా రన్ ఇప్పట్లో ఆగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై 19 రోజులు పూర్తి చేసుకొని 20వ రోజు లోకి అడుగుపెట్టింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద జోరు ఏ మాత్రం తగ్గలేదు. బుక్ మై షో యాప్ లో నేడు ఈ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. 18 రోజులకు గాను ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా కోటి కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. ఒక A సర్టిఫికేట్ సినిమాకు ఈ రేంజ్ థియేట్రికల్ రన్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఇకపోతే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి 19 రోజులకు గాను ఇండియా వైడ్ గా 738 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 22.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 202 కోట్ల రూపాయిలు అన్నమాట. బాలీవుడ్ కి బిగ్గెస్ట్ మార్కెట్ అయినటువంటి మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రం విడుదలను నిషేధించినా కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది అనేది. ఓవరాల్ గా ఓవర్సీస్ + ఇండియా వైడ్ గా కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 19 రోజుల్లో 940 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ గురువారానికి ఈ చిత్రం కచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 19 వ రోజున 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో, లేదా వచ్చే వారం తో కచ్చితంగా ఈ చిత్రం ‘పుష్ప 2’ ఫుల్ రన్ రికార్డు (800 కోట్ల నెట్) ని దాటేస్తుందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమాకు 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. సీక్వెల్ కాకుండా ఒక స్టాండ్ ఎలోన్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్, అది కూడా ఇతర బాషల సహాయం లేకుండా అంటే అద్భుతం అనే చెప్పాలి. ఇతర భాషల్లో ‘దురంధర్’ చిత్రాన్ని డబ్ చెయ్యాలని పెద్ద డిమాండ్ ఉంది. కానీ సమయం సరిపోకపోవడం తో ఈసారికి ఓటీటీ తోనే సరిపెడుతారట, కానీ ‘దురంధర్ 2’ ని మాత్రం మార్చ్ 19 న కచ్చితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తారట.