Gautam Gambhir : టీమిండియా కు ఏ ముహూర్తంలో గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చాడో తెలియదు గాని సోషల్ మీడియా మొత్తం అతడి చుట్టూ తిరుగుతోంది. అతడు మాట్లాడే మాట, వేసే అడుగు, తీసుకునే నిర్ణయం ఇలా ప్రతిదీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా జట్టు చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది.. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.
గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో దారుణమైన ఓటములను సొంతం చేసుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఇంతటి దారుణమైన పరాభవాల నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద మాజీ ప్లేయర్లు, అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అతడిని శిక్షకుడి స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ఇటీవల దక్షిణాఫ్రికా పై విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా కరచాలనం చేయలేదు. పైగా విరాట్ కోహ్లీ మీద కోపంగా చూశాడు.. రోహిత్ శర్మతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించాడు. ఇవన్నీ కూడా అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పించాయి. అందువల్లే గౌతమ్ గంభీర్ ను అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి నెటిజన్లు ఓ వీడియోను రూపొందించారు.. ఆ వీడియో చూసేందుకు అత్యంత ఆసక్తికరంగా ఉంది.
ఓ ప్రాంతంలో గుర్రపు పందాలు సాగుతున్నాయి. అందులో గుర్రాన్ని ఎక్కిన వ్యక్తి కొంత దూరం వెళ్ళగానే కిందపడిపోతాడు. అయినప్పటికీ ఆ గుర్రం పరుగును ఆపదు. మిగతా గుర్రాలను రౌతు లు నడిపిస్తున్నప్పటికీ.. ఆ గుర్రం మాత్రం మిగతా వాటికంటే వేగంగా పరుగులు పెడుతుంది. ఈ వీడియోను చూసిన వారంతా టీమిండియా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కోచ్ లేకుంటేనే టీమిండియా అద్భుతమైన విజయాలు సాధిస్తుందని చెబుతున్నారు. జట్టు కోచ్ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ ను తొలగించాలని పరోక్షంగా చెబుతున్నారు.
Indian team without its coach pic.twitter.com/t3eqb4pJ9B
— Gabbar (@GabbbarSingh) December 9, 2025