Tamil Nadu Politics: పెరియార్ రామసామీ.. తమిళనాట ద్రవిడ వాదానికి మూల పురుషుడు. అసలు భారత్ నుంచి తమిళనాడును వేరు చేయాలని కుట్ర పన్ని విఫలమైన వ్యక్తి. హిందూ మతాన్ని నాశనం చేయాలని కంకణం పెట్టుకున్న వ్యక్తి. కులాల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి. బ్రాహ్మణ వ్యతిరేకి. తమిళ భాషను కూడా కించపరిచాడు. అయినా కూడా తమిళనాట పెరియార్ ను విమర్శించడానికి వీలులేని మేధావి, ద్రవిడవాదానికి మూలకర్తగా.. దేవుడిగా మారాడు.
తమిళనాడు ప్రత్యేకం.. మా ఆత్మగౌరవం వేరు అంటూ పెరియార్ బోధనలతో చెడు ధోరణిలో తమిళ ప్రజలను నడిపించారు. డీఎంకేను వ్యతిరేకించిన ఎంజీఆర్ కూడా పెరియార్, ద్రవిడ వాదాన్ని విమర్శించలేదు. ఆ ఎకో సిస్టం అలానే కంటిన్యూ అయ్యింది.
మొట్టమొదటి సారి ఆ ఎకోసిస్టంను దెబ్బతీసింది అన్నామలైనే. పెరియార్ విగ్రహాలను దేవాలయాల ముందు పెట్టవద్దని.. కూడళ్లలో పెట్టాలని సంచలన పిలుపునిచ్చాడు. త్రి లాంగ్వేజ్ ఫార్ములాను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాడు.
అన్నాడీఎంకే షరతులకు తలొగ్గి ద్రవిడవాద వ్యతిరేక పోరును నీరు గార్చిన బీజేపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.