Richest Indian-Americans : నిన్న ఫోర్బ్స్ ప్రచరించిన ఓ వార్త చర్చనీయాంశమైంది. మొత్తం బిలియనీర్ల లిస్ట్ లో అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పైనున్న 900 మంది ఉంటే.. అందులో 125 మంది ఇతర దేశాల్లో జన్మించి అమెరికా పౌరసత్వం తీసుకున్నవారే. అంటే వలసదారులేనన్న మాట.. 14 శాతం మంది సంపద సృష్టించిన అత్యంత ధనవంతుల్లో 14 శాతం మంది ఆ దేశంలో పుట్టని వారే కావడం గమనార్హం. 7.2 ట్రిలియన్ డాలర్లలో 1.3ట్రలియన్ డాలర్లను ఇతర దేశాల వారే సృష్టించారు.
అమెరికాలో పుట్టని వారు అత్యధికంగా సంపాదించింది ఎవరంటే ఎలన్ మస్క్. ఆయన సౌతాఫ్రికా నుంచి వచ్చినవారే. రెండో వ్యక్తి సెర్గీ బ్రిన్.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు.. ఈయన రష్యాలో పుట్టి 6 ఏళ్ల వయసులో అమెరికాకు వలసవచ్చాడు. వలసదారల్లో 2వ వ్యక్తి. జాన్సన్ కువాన్ అనే 3వ వ్యక్తి తైవాన్ నుంచి వచ్చాడు.
భారతదేశంలో పుట్టిన జై చౌదరి అమెరికా బిలియనీర్లలో టాప్ 8లో ఉన్నారు. 125 మంది ఇతర దేశస్థుల్లో 43 దేశాల నుంచి ఈ 125 మంది ఉన్నారు. వీరంతా అమెరికాలో పుట్టకుండా ఆ దేశంలో సంపద సృష్టించారు. ఇందులో మూడింట రెండు వంతుల వారు కేవలం 10 దేశాల నుంచే వచ్చారు.
ఫోర్బ్స్ ప్రకారం.. భారత్ లో పుట్టిన వారు 12 మంది అమెరికా బిలియనీర్లలో ఉన్నారు. భారత్ ఇప్పుడు బిలియనీర్లలో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఇజ్రాయెల్ 11, తైవాన్ 11, కెనడా 9, చైనా 8మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
అమెరికాలో అత్యంత ధనవంతులైన భారతీయ వలసదారుల వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.