Thammudu Movie Copied from: టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కు కూడా మంచి పేరు ఉంది. ఈ హీరో ఒకప్పుడు స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. ‘జయం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఆ తర్వాత ‘దిల్’ అంటూ వచ్చి తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవడంతో ఇక నితిన్ కు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ రెండు హిట్ సినిమాల వల్ల తెలుగు ఇండస్ట్రీల్లో నితిన్ ఓ రేంజ్‌కు వెళ్లతాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వరుస ప్లాపులతో టాప్ రేసు నుంచి నితిన్ సడెన్ గా ఢీలా పడిపోయాడు. నాలుగు సినిమాలు చేస్తే అప్పుడు ఒక హిట్టు అన్నట్టుగా మారాడు.
‘గతంలో రష్మిక మందన, నితిన్ కలిసి నటించిన భీష్మ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ లుగా తరువాత నితిన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ నటించిన లాస్ట్ సినిమాలు నాలుగు కూడా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడ్డాయి. దీంతో ఆయన అభిమానులు కూడా చాలా నిరాశ చెందారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా గురించి చాలా దారుణమైన టాక్ వస్తుంది.
కనీసం పెట్టుబడి కూడా రాలేదట. అయితే ఈ సినిమాను ఒక సినిమా నుంచి కాపీ చేశారట. అదేంటో తెలుసా? MCA. హీరో నాని, సాయి పల్లవి నటించిన ఈ సినిమా మీకు గుర్తుందా? సేమ్ అదే స్టోరీతో ఇప్పుడు తమ్ముడు సినిమా ఉందని.. ఇదేంటి నితిన్ కు వేరే సినిమాలే దొరకలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. అచ్చం MCA కాన్సెప్ట్ మూవీతోనే వచ్చిందట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఒకరే. అంతేకాదు ప్రొడ్యూసర్ కూడా ఒకరేనట. MCA సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చింది. అదే డైరెక్టర్ ఇప్పుడు తమ్ముడు సినిమాకు కూడా దర్శకత్వం వహించారట. అంతేకాదు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా ఒకరే. అతనే దిల్ రాజు.
Also Read: శ్రీలీలను నలిపేశాడు.. ఏం అదృష్టం రా బై నీది!
మొత్తం మీద నితిన్ నటించిన ఈ సినిమా కూడా తుస్ మన్నట్టే అంటూ నిరాశ చెందుతున్నారు ఆయన అభిమానులు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ,మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్ సినిమాల మీద ఆశలు పెట్టుకొని నిరాశ చెందిన ప్రేక్షకులకు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది అన్నమాట. ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ ,’రాబిన్ హుడ్’ సినిమాలు అయితే ఎప్పుడు వచ్చాయో కూడా చాలా మందికి తెలియదు. పెద్దగా ఎక్స్ పర్ట్స్ కానీ డైరెక్టర్ల వల్లనే ఈ పరిస్థితి వస్తుంది మా హీరోకు అంటూ కొందరు అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. మరి చూడాలి ముందు ముందు ఇంకా ఎలాంటి సినిమాలో చేస్తాడో ఈ హీరో.