Javed Akhtar event cancelled: జావేద్ అక్తర్.. ప్రఖ్యాత సినీ గేయ రచయిత.. ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్ లో ఊర్దు అకాడమీ ఆయన ముఖ్య అతిథిగా ఒక కార్యక్రమానికి పిలిచింది. హిందీ సినిమాపై ఉర్దూ ప్రభావంపై ప్రసంగించడానికి పిలిచారు. ప్రభుత్వ కార్యక్రమం ఇదీ. ఆయన రెడీ అయిపోయి రావడానికి సిద్ధంగా ఉండగా.. ఒక్కసారిగా కార్యక్రమాన్ని ఉర్దు అకాడమీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు.
నాలుగైదు రోజుల నుంచి ఇస్లామిక్ సంస్థలు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జావేద్ అక్తర్ ను పిలవద్దని.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇస్లామిక్ సంస్థల హెచ్చరికలతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. హిందీ సినిమా మీద ఉర్దూ ప్రభావం అనేది సింపుల్ పాయింట్ నాన్ కాంట్రవర్షల్ సబ్జెక్ట్.అయినా ఇస్లామిక్ సంస్థలను సంతృప్తి పరచడానికి బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దు చేసింది.
జావేద్ అక్తర్ కార్యక్రమాన్ని మమతా ఎందుకు రద్దు చేసింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.