https://oktelugu.com/

Maharashtra Assembly Elections : ముస్లింలు గంపగుత్తగా ఎందుకు ఇండీ కూటమి వైపు లేరు?

Maharashtra Assembly Elections : ముస్లింలు గంపగుత్తగా ఎందుకు ఇండీ కూటమి వైపు లేరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : December 5, 2024 / 08:52 PM IST

Maharashtra Assembly Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎటు ఓటు వేశారు.. ఎన్నికలు అయి చాలా రోజులు అయినా కూడా అక్కడ ముస్లింలు ఇండీ కూటమికి ఓటు వేయలేదు. గణాంకాలు చూస్తే ముస్లింల ఓటు కాంగ్రెస్ కూటమికి పడలేదని అర్థమవుతోంది.

మహారాష్ట్రలో 20శాతానికి పైగా ముస్లింలు ఉన్న నియోజకవర్గాలు 38. వీటిల్లో ఒక్కసారి ఫలితం చూస్తే.. ముస్లింలు గెలిచినవి కేవలం 10 నియోజకవర్గాలు. ఇందులో మహాయుతి 22 సీట్లు గెలిచింది. మహావికాస్ అఘడి 13 సీట్లు గెలిచింది. ఇతరులు 3 సీట్లు గెలిచారు.

38లో మెజార్టీ బీజేపీ కూటమి మహాయుతినే గెలిచింది. కాంగ్రెస్ 3, ఎన్సీసీ 2, సమాజ్ వాది 2, ఎంఐఎం 1, శివసేన 1, శివసేన (బాల్ ఠాక్రే) 1 సీట్లు గెలిచారు.

ఈ లెక్కలు చూస్తే ముస్లింల ఓట్లు అన్ని కూడా ఒకవైపే వేయలేదని అర్థమవుతోంది. ముస్లిం ఓటర్లు ఉన్న బూత్ ల్లో మహిళా ముస్లింలు బీజేపీకి ఒక సెక్షన్ ఓటు వేయడం విశేషం.

ముస్లింలు గంపగుత్తగా ఎందుకు ఇండీ కూటమి వైపు లేరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ముస్లింలు గంపగుత్తగా ఎందుకు ఇండీ కూటమి వైపు లేరు? | Why are Muslims not in favor of India alliance?