Kumbh Mela Stampede : నిన్న మహాకుంభమేళ.. మౌనీ అమావాస్య.. మొదటి నుంచి కుంభమేళపై భయమే నిజమైంది. 10 కోట్ల మంది వస్తారు..144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఇదీ.. భక్తులకు ఆ పవిత్ర దినాన స్నానం చేయాలన్న నమ్మకం.. విశ్వాసం ఎవ్వరూ ఆపలేరు. చనిపోయిన తర్వాత కూడా 7.50 కోట్ల మంది స్నానం చేశారంటే.. ఎలాగైనా సరే అమావాస్య రోజు స్నానం చేయాలన్న కోరిక డామినేట్ చేస్తోంది. వేలాది సంవత్సరాల నుంచి వస్తున్న విశ్వాసం ఇదీ
గత 3 రోజుల్లోనే 12.5 కోట్ల మంది భక్తులు వస్తున్నారు. యూపీ జనాభాలో సగం మంది వచ్చి స్నానం చేశారు. ఒక చిన్న ప్రదేశంలో 12.50 కోట్ల మంది గుమిగూడడం ఒక ప్రపంచ వింతగా చెప్పొచ్చు. భక్తుల్లో ఉన్న కోరిక దీన్ని బట్టి తెలుస్తోంది.
ఈ స్థాయిలో అరేంజ్ మెంట్స్ కూడా ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదు. యోగి ఉన్నాడు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఎంత ప్రయత్నించినా ఇలాంటి విషాదాలు జరుగుతుంటాయి. సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే సెక్యూరిటీ తమ చేతుల్లోకి తీసుకురానుంది.
కుంభమేళా తొక్కిసలాటకు బాధ్యులెవరు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.