Water War : సింధూ నది ఒప్పందం.. ఎప్పుడైతే భారత్ రద్దు చేసుకుందో ఎన్నో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది కరెక్టా? పాకిస్తాన్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా అన్న వాదన వినిపిస్తున్నారు.
సింధూ నదిపై మనకన్నా పాకిస్తాన్ జనరల్ ఆయుబ్ ఖాన్ రాసిన ‘ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్’ పొలిటికల్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ప్రచురించాడు. దాని ప్రకారం ఆయన పడ్డ తపన పేర్కొన్నాడు. సింధూ నది ఒప్పందంపై ఆయన పడ్డ తపన ను రాసుకొచ్చాడు.
సింధూ నది లేకపోతే పాకిస్తాన్ ఎడారి అవుతుందని.. చుక్కనీరు రాదని.. మొత్తం ఎండిపోతుందని ఆయుబ్ ఖాన్ నాడు ఎంతో తపన పడి ఒప్పందం చేయించాడు. ఎవ్వరు అడ్డుకున్నా వారిని హెచ్చరించాడు.
పాకిస్తాన్ సింధూ నదిపై బ్రిడ్జీలు కట్టలేని పరిస్థితి. డబ్బుల్లేవని.. సాయం కోసం అడుక్కుతినే పరిస్థితి. ఇండస్ బేసిన్ డెవలప్ మెంట్ ఫండ్స్ పేరిట సంస్థ పెట్టి పాశ్చత్య దేశాలు అన్నీ కలిపి 1070 మిలియన్ డాలర్ల ఫండ్ కలెక్ట్ చేశారు. 870 మిలియన్లు పాకిస్తాన్ ప్రాజెక్టులు కట్టడానికే సాయం చేశారు. భారత్ కూడా 170 మిలియన్ డాలర్లు ఇవ్వడం విశేషం. పాకిస్తాన్ ఒక్క డాలర్ కూడా వ్యయం చేయలేదు.
నీటి యుద్ధాలు మనమే కాదు ఇంతకు ముందు ఎన్నో దేశాలు చేసాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.