Waqf Bill : వక్ఫ్ చట్టమైంది.. రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సీఐఐ చట్ట అనుభవంతో ఈసారి ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడింది. ఏప్రిల్ 15న చట్టం పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే.. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు ప్రజల మధ్యకు వెళుతున్నాయి. అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మోడీనే స్వయంగా సీఐఐ న్యూస్ 18 సమ్మిట్లో దీనికి మోడీ అంకురార్పణ చేశారు.
2013 చట్ట సవరణలు ఏ విధంగా భూబకాసురులను సృష్టించిందో వివరించింది. చట్టం న్యాయం చేయాలి కానీ భయపెట్టవద్దు. ఏ చట్టం కూడా రాజ్యాంగానికి అతీతంగా ఉండకూడదు. ఇప్పుడు మేం చేసింది ఏం లేదు. 2013 చట్టం తొలగించలేదు. దాన్ని సరిచేశాం. 2013 వక్ఫ్ సవరణ చట్టం.. భారతీయ చట్టాలను లెక్కచేయకుండా ఉంది. కానీ ఇప్పుడు మేం లెక్క చేసేటట్టు సరిచేశాం. 2013 చట్టం ప్రజల్లో భయాన్ని సృష్టిస్తే.. ఇప్పుడు మేం తీసుకొచ్చిన చట్టం న్యాయం కోసం కోర్టుల్లో పోరాడే రైట్స్ ఇచ్చాం.
కొంత మంది భూబకాసురుల కబంధ హస్తాల నుంచి సామాన్య ముస్లింలు, మహిళల హక్కులను కాపాడామని మోడీ స్పష్టం చేశారు.
ఒకవైపు స్వయంగా మోడీ.. రెండోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.