Peddi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులకు మాత్రమే మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక వాళ్లతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు పోటీ పడుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం…ఇక యంగ్ డైరెక్టర్లు సైతం సూపర్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు…
బుచ్చి బాబు (Buchhi babu) డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan)హీరోగా వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక సుకుమార్ శిష్యుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఆయన రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గ కథను రాసుకొని ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గల్లి క్రికెటర్ గా కనిపించబోతున్నాడు… ఇక సినిమా స్టోరీ ని కనక మనం ఒకసారి చూసినట్లయితే రెండు వర్గాల మధ్య ఉండే ఆధిపత్య పోరులో క్రికెట్ పోటీ అయితే పెడతారట.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
ఇందులో ఎవరు గెలుస్తారు అనే స్థాయికి ఉత్కంఠ ను తీసుకెళ్తారట. ఇక మొదట్లో రామ్ చరణ్ కి క్రికెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వల్ల ఊరు పెద్దమనిషి పరువు మర్యాదలు కాపాడడానికే ఆయన క్రికెట్ ఆడబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఈ మ్యాచ్ అయితే ప్రతి ఒక్కరికి హై ఫీల్ ఇస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి తన నటనలోని పుటెన్షియాలిటీని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక బుచ్చిబాబు సైతం రామ్ చరణ్ నటనని ఎలివేట్ చేయడానికి కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగా రాసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి వాటిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక బుచ్చిబాబు ఇప్పటి వరకు ఒక సినిమానే చేసినప్పటికి రెండో సినిమాతోనే పెద్ద హీరోను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన కెరీర్ అనేది భారీగా డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ సినిమా అతనికి చాలా కీలకమనే చెప్పాలి.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?