Bihar Politics : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. ముఖ్యంగా బీహార్ లో.. నితీష్ కుమార్ ఇప్పటికీ ఎన్నో కుప్పిగంతులు వేశాడు. ఇప్పుడు ఏం జరుగబోతోంది..? ఈ సంవత్సరం చివరికి ఎన్నికలు ఉంటాయి. అయితే నితీష్ కు భయం పట్టుకుంది. లేట్ అయితే తనకు ఇబ్బంది కావచ్చు. ప్రతిపక్షాలు బలపడుతాయని భయపడుతున్నాడు.
బీహార్ లో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. బీజేపీ దయతో ముఖ్యమంత్రి సీట్లో నితీష్ కూర్చున్నాడు. అదే అతడు జీర్ణించుకోవడం లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు అయితే నితీష్ మెంటల్ బ్యాలెన్స్ తప్పాడని మాట్లాడుతున్నాడు. పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి..
బీజేపీ కొత్త సామ్రాట్ చౌదరిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. ఈ సామ్రాట్ ఇప్పుడు నితీష్ కుమార్ కు పోటీగా ఎదుగుతున్నాడు.. ఈయన కోయిరీ కులస్థుడు.. బీహార్ లో కుల రాజకీయాలు ఎక్కువ. నితీష్ కుర్మీ కులం కాగా.. సామ్రాట్ కోయిరీ.. రెండూ ఒక వర్గంలోని కులాలే..
బీజేపీ ఈ సామ్రాట్ చౌదరిని ఎంకరేజ్ చేస్తోందని నితీష్ లో కంగారు మొదలైంది. రెండో వైపు చిరాగ్ పాశ్వాన్ పోటీలో గట్టిగా నిలబడ్డాడు. ఈయన హైలీ అంబీషియస్. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని ముందుకెళుతున్నాడు. నితీష్ కు వ్యతిరేకంగా కదులుతున్నాడు. జితిన్ రాం మాంజీ దళితుల్లో ముఖ్యనేత. ఈయనకు అవామీ పార్టీ ఉంది. ఈయన నితీష్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మూడో ప్లేయర్ ప్రశాంత్ కిషోర్ బీహార్ లో మొత్తం పాదయాత్ర చేసి బలంగా తయారవుతున్నాడు.
ఎవరికీ అంతుపట్టని మార్పులు బీహార్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.