Idiot Movie Heroine: ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.అలా ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన అందాల తారలలో హీరోయిన్ రక్షిత కూడా ఒకరు.మాస్ మహారాజ్ హీరో రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో రక్షిత టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో హీరోయిన్ రక్షిత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత రక్షిత తెలుగులో ఎన్టీఆర్ తో, మహేష్ బాబుతో అలాగే నాగార్జున వంటి బడా హీరోల సరసన కూడా నటించింది. తెలుగుతోపాటు కన్నడ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే రక్షిత అసలు పేరు శ్వేత. బెంగళూరులో పుట్టి పెరిగిన రక్షిత తండ్రి బీసీ గౌరీ శంకర్ కొరియోగ్రాఫర్, ఆమె తల్లి మమతారావు ఒక కన్నడ నటి. రక్షిత తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కాబట్టి సినిమా రంగంలో రక్షిత ఎంట్రీ చాలా సులభంగా జరిగింది. రక్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన అప్పు అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దాంతో ఇక చదువులకు పుల్ స్టాప్ పెట్టేసి రక్షిత అప్పు సినిమాతో 2002లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అప్పు కు రీమేక్ గా తెలుగులో ఇడియట్ సినిమా అలాగే తమిళ్లో దమ్ అనే సినిమాలలోనూ రక్షిత అనే హీరోయిన్ గా నటించింది. కన్నడలో ఈమె టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ఇక తెలుగులో ఈమె శివమణి, నిజం, ఆంధ్రావాలా, జగపతి వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా వరుస హిట్స్ సొంతం చేసుకొని టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరియర్ మంచి రేంజ్ లో ఉన్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను 2007లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పి వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటుంది. రక్షిత జోగయ్య, డీకే అనే రెండు సినిమాలను నిర్మించింది. అయితే ప్రస్తుతం రక్షిత గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎంతగానో బరువు పెరిగి లావుగా ఉన్న ఆమెను చూసి అభిమానులు నోరెళ్ళ పెడుతున్నారు.
తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్ కు రక్షిత హాజరయ్యింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న రక్షిత బరువు పెరిగి గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. ఈవెంట్ కు సంబంధించిన వీడియోను ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. 22 ఏళ్లలో హీరోయిన్ రక్షిత ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన రక్షిత తనకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ సమస్యతో ఇలా లావెక్కానని తెలిపారు.
View this post on Instagram