BJP state president elections : బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి ప్రస్తుతం అంతరంగిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తున్నప్పుడు అంతరంగిక ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం మనగ గలుగుతుంది. 10 కోట్ల సభ్యత్వాలను అక్టోబర్ కు పూర్తి చేసుకుంది. మెజార్టీ బూతులు, బ్లాక్ లు , జిల్లా స్థాయిలో కూడా అధ్యక్షుల ఎన్నిక కూడా పూర్తయ్యింది.
50 శాతానికి పైగా జిల్లా అధ్యక్షులు పూర్తి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక కావడానికి వీలైంది. 60 శాతం బీజేపీ అధ్యక్షులు 2 సార్లు పూర్తి చేసుకోవడంతో ఇక వారు పోటీచేయడానికి వీలు లేదు. ఇక 40 శాతంలోనూ వారే మళ్లీ గెలుస్తారని గ్యారెంటీ లేదు. ఇదో ప్రజాస్వామిక ఎన్నికలుగా అభివర్ణించవచ్చు.
తెలంగాణలో బండి సంజయ్ ను మార్చాక అడహక్ కమిటీని వేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఇక్కడ ఈ నెల చివరికల్లా కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఆంధ్రాలో పురంధేశ్వరి రెండోసారి గెలుస్తుందా లేదా చూడాలి.
కర్ణాటకలో రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉంది. కేరళలో సురేంద్రన్ తిరిగి ఎన్నిక అవుతాడా? అన్నది చూడాలి. ఇంటర్నల్ డెమొక్రసీ బీజేపీలో ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.
ప్రపంచ అతి పెద్ద పార్టీ బీజేపీలో ఎన్నికల వాతావరణం వాడిగా వేడిగా సాగుతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.